Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

ABN , First Publish Date - 2023-08-14T18:27:55+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..

Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో (Punganur Incident) టీడీపీ కీలక నేత, రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ గంటా నరహరికి (Ganta Narahari) హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. ఈ నెల 17వ తేదీ వరకు నరహరిని పోలీసులు అరెస్ట్ చేయకూడదంటూ కోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఇదే కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) , నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (Nallari Kishore Kumar Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. రిప్లై వాదనలు వినిపించేందుకు గాను కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. వాదనలు వినేంతవరకూ ఉమ, కిషోర్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పోలీసులకు చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు సూచించింది. మొత్తానికి చూస్తే.. ముగ్గురు కీలక నేతలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు.


ap-high-court.jpg

ఇంకెంత మందో..!?

ఇదిలా ఉంటే.. పుంగనూరు ఘటనలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరగా.. 246 మందికిపైగా టీడీపీ శ్రేణులను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. అన్ని కేసుల్లోనూ ఏ1గా పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డిని చూపారు. కాగా.. పుంగనూరు బండ్లపల్లెకు చెందిన వి.చిన్నరెడ్డెప్ప(59), రొంపిచెర్ల మండలం మోటుమల్లెలకు చెందిన ఎం.చెంగల్రాయనాయుడు (55), ఎం.వెంకట్రమణ నాయుడు(66)ను మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు పంపారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 74కు చేరింది. 7 కేసుల్లో 246 మందిని నిందితులుగా చూపగా.. ఇంతరులు జాబితాలో ఇంకెంతమంది కార్యకర్తలు, నాయకుల పేర్లు చేరతాయోనన్న ఆందోళనలో టీడీపీ వర్గాలు ఉన్నాయి. పుంగనూరుకే తాము రాలేదని, కానీ వైసీపీ నేతలు చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పేర్లు కేసుల్లో చేర్చారని, తాము గొడవకు వెళ్లలేదని, అసలు పుంగనూరులోనే లేమనే సాంకేతిక, రికార్డుపరమైన ఆధారాలున్నాయని పలువురు చెబుతున్నారు.

Punganuru.jpg


ఇవి కూడా చదవండి


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ


Updated Date - 2023-08-14T18:34:52+05:30 IST