MLA: అధికారులకు పోలవరం ఎమ్మెల్యే ఆదేశం

ABN , First Publish Date - 2023-05-04T21:43:44+05:30 IST

పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం సచివాలయం పరిధిలో ...

MLA: అధికారులకు పోలవరం ఎమ్మెల్యే ఆదేశం

ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం సచివాలయం పరిధిలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో పోలవరం వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Polavaram YCP MLA Tellam Balaraju) పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించి, ప్రజలకు అందిన పథకాల వివరాలను తెలియజేశారు. సమస్యల గురించి ఆరా తీస్తూ, సూచనలు, సలహాలు అడుగుతూ ముందుకు సాగారు. గ్రామంలో ఉన్న ప్రాధాన్యత సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2023-05-04T22:59:34+05:30 IST