AP NEWS: ముత్యాలమ్మకు స్వర్ణవర్ణపూర్ణకవచం.... దాతలకు ధన్యవాదాలు

ABN , First Publish Date - 2023-03-23T20:05:38+05:30 IST

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయ సమీపంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ (Muthyalamma) అమ్మవారి తృతీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

AP NEWS: ముత్యాలమ్మకు స్వర్ణవర్ణపూర్ణకవచం.... దాతలకు ధన్యవాదాలు

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం (Jangareddygudem) పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయ సమీపంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ (Muthyalamma) అమ్మవారి తృతీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు, దాతల తోడ్పాటుతో వైభవంగా పూర్తయిందని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ చెప్పారు. ప్రధమ దర్శనంగా ఉగాది రోజు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణకవచ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కవచం కోసం గురవాయిగూడెం అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కీసర రామిరెడ్డి దంపతులు రూ.50,000, తమ కుమారులు తిలక్, సురేష్, సతీష్‌ సంయుక్తంగా రూ. 25,000 అందజేశారని ఆయన తెలిపారు.

WEST.jpg

కీసర రామిరెడ్డి కుటుంబానికి, తృతీయ వార్షికోత్సవ ఉత్సవ కమిటీకి, భక్తులకు, దాతలకు బవిరిశెట్టి మురళీకృష్ణ ధన్యవాదాలు చెప్పారు. ఆలయంలో 19 నుంచి 22 వరకూ జరిగిన కార్యక్రమాలు గుర్తుచేస్తూ ఉగాది రోజు సాయంత్రం దాస సాహితీ వసుంధర భజన మండలి వారిచే కోలాట ప్రదర్శన జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కాజా ఫణికుమార్ శర్మ, ధనకుమార్ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-23T20:28:03+05:30 IST