TDP Leader: ‘అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’
ABN , First Publish Date - 2023-03-21T15:17:46+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పొగాకు తోటలను నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పొగాకు తోటలను నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (TDP Leader Boragam Srinivasulu) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన జరిగిన నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ... అకాల వర్షాతో రైతుల చేతికి వచ్చిన పంట దెబ్బతిని ఆందోళనలో ఉన్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని కనీసం సంబంధింత అధికారులు కూడా జరిగిన నష్టం గురించి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, కలగర రాము, చిలకమూడి సుధాకర్, పసుమర్తి భీమేశ్వరరావు, కుందుల శ్రీను, గన్నిన సూర్యచంద్రరావు, తూంపాటి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.