Share News

Nimmala Ramanaidu: అర్ధరాత్రి మానవత్వం చాటుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-10-28T12:38:30+05:30 IST

నిండు గర్భిణికి సహాయం చేసి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మానవత్వం చాటుకున్నారు.

Nimmala Ramanaidu: అర్ధరాత్రి మానవత్వం చాటుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి: నిండు గర్భిణికి సహాయం చేసి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (MLA Nimmala Ramanaidu) మానవత్వం చాటుకున్నారు. గత అర్ధరాత్రి నిండు గర్భిణి పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక కుటుంబసభ్యులు అయోమయస్థితిలో ఉండిపోయారు. చివరకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు గర్భిణి కుటుంబసభ్యులు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ఆస్పత్రికి వచ్చి గర్భిణికి వైద్య సేవలు అందేలా బాధ్యత తీసుకున్నారు. బయటనుంచి డాక్టర్లను రప్పించి మరీ గర్భిణీకి వైద్య సేవలు అందజేశారు. దీంతో మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను చూసి మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రామానాయుడు అన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు సహాయానికి జన్మంతా రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-10-28T16:08:22+05:30 IST