Share News

YuvaGalam Sabha: మహానాడును తలపిస్తున్న నవశకం ప్రాంగణం.. దారులన్నీ పోల్లిపల్లి వైపే...

ABN , Publish Date - Dec 20 , 2023 | 03:20 PM

Andhrapradesh: యువగళం ముగింపు సభ ప్రాంగణం మహానాడును తలపిస్తోంది. యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. నవశకం బహిరంగసభ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తోంది.

YuvaGalam Sabha: మహానాడును తలపిస్తున్న నవశకం ప్రాంగణం.. దారులన్నీ పోల్లిపల్లి వైపే...

విజయనగరం: యువగళం ముగింపు సభ ప్రాంగణం మహానాడును తలపిస్తోంది. యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. నవశకం బహిరంగసభ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తోంది. రాయలసీమ, ఉత్తరకోస్తా నుంచి విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు విజయనగరం చేరుకున్నాయి. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నవగళం సభకు అందుబాటులో ఉన్న వాహనాల్లో టీడీపీ - జనసేన కార్యకర్తలు తరలివస్తున్నాయి. సభకు వస్తున్న ఇరుపార్టీల శ్రేణులకు విజయనగరం నేతలు సాదరంగా స్వాగతం పలికి ఆతిధ్యమిస్తున్నారు. 2014 తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై రానుండటంతో నవశకం సభపై రాష్ట్ర, జాతీయ మీడియా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబుకు విశాఖ ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకోనున్నారు. టీడీపీ - జనసేన కార్యకర్తలు, అభిమానులతో నవశకం ప్రాంగణం కళకళలాడుతోంది.


మరోవైపు నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. భారీ బెలూన్లు, డీజే చప్పుళ్లు, నినాదాలతో నవశకం ప్రాంగణం హోరెత్తుతోంది. నవశకం వేదికపై ఆహుతులను ఉత్తరాంధ్ర సాంప్రదాయ కళా నృత్యాలు అలరిస్తున్నాయి. సభా ప్రాంగణంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్య భారీ కటౌట్లు ఆకర్షణీయంగా ఏర్పాటయ్యాయి. టీడీపీ - జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణంలో సందడే సందడి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి ఇరుపార్టీల ముఖ్యనేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి పోలేపల్లి వరకు జాతీయరహదారి మొత్తం బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలతో కన్నుల పండువగా మారింది. నవశకం వేదిక వద్ద సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కార్యకర్తలకు టీడీపీ - జనసేన నేతలు సూచనలిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 20 , 2023 | 03:20 PM