Share News

Vizianagaram Dist.: పోలిపల్లిలో నేడే టీడీపీ యువగళం విజయోత్సవ సభ

ABN , Publish Date - Dec 20 , 2023 | 07:39 AM

విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది.

Vizianagaram Dist.: పోలిపల్లిలో నేడే టీడీపీ యువగళం విజయోత్సవ సభ

విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు రానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా.. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

విజయోత్సవ సభ నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశారు. స్టేజీ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు.. స్టేజీపై 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అభిమానులు ప్రత్యేక రైళ్లలో విజయనగరం చేరుకోనున్నారు. ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు, విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. భోగాపురం వచ్చే అన్ని వైపులా భోజన ఏర్పాట్లు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. విజయోత్సవ సభకు పలు ప్రాంతాల నుండి హాజరయ్యే వారికి పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.

Nara Lokesh : జైత్రయాత్ర!

విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు ప్రజలు తరలివెళ్లనున్నారు. జిల్లాలో ఒక్కో నియోజక వర్గం నుంచి సుమారు నాలుగు వేల మంది చొప్పున కార్యకర్తలు, నాయకులు బయల్దేరనున్నారు. ఈ మేరకు రవాణా ఇబ్బందులు కలగకుండా పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జిలు బోనెల విజయచంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అనేక వాహనాలను సిద్ధం చేశారు. వాటి ద్వారా పార్టీ శ్రేణులు ముగింపు సభకు హాజరై.. తిరిగి ఇళ్లకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్సీలు శత్రుచర్ల విజయరామరాజు, ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, ఆర్పీ భంజ్‌దేవ్‌తో పాటు 15 మండలాల నుంచి టీడీపీ శ్రేణులు ముగింపు సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు కూడా యువగళం ముగింపు సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.

Updated Date - Dec 20 , 2023 | 07:40 AM