Vishnukumar Raju : చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు తెలియదా? ఎవరిని మభ్యపెడతారు?

ABN , First Publish Date - 2023-10-11T13:12:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ సీఎం జగన్‌కు తెలియదని అంటున్నారని.. ఎవరిని మభ్యపెడతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు.

Vishnukumar Raju : చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు తెలియదా? ఎవరిని మభ్యపెడతారు?

విశాఖ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ సీఎం జగన్‌కు తెలియదని అంటున్నారని.. ఎవరిని మభ్యపెడతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. మద్యం పేరుతో నాలుగు సంవత్సరాలుగా దోపిడి చేస్తున్నారన్నారు. కల్తీ మద్యంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచే ఏపీలో మద్యాన్ని బ్యాన్ చెయ్యాలని విష్ణు కుమార్ రాజు అన్నారు.

మద్యంపై శ్రేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల ప్రక్రియలో వలంటీర్ల వ్యవస్థను దూరంగా ఉంచాలన్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అరాచకాలపై ప్రజలు స్పందించాలన్నారు. వైసీపీ హయాంలో ప్రతీది స్కామేనన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోవద్దని.. చిత్తుగా ఓడించాలని విష్ణుకుమార్ రాజను అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. సీబీఐను కంట్రోల్ చేసిన ఘనత జగన్‌దేనన్నారు.

Updated Date - 2023-10-11T13:12:40+05:30 IST