Vangalapudi Anita: మద్యం లేకపోతే వైసీపీ ప్రభుత్వమే లేదు..
ABN , First Publish Date - 2023-04-04T16:36:04+05:30 IST
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టో బైబిల్ (Bible), ఖురాన్ (Quran), భగవద్గీత (Bhagavad Gita) అన్న సీఎం జగన్ (CM Jagan).. మద్యపాన నిషేధం (Alcohol Prohibition)పై ఒక్క రివ్యూ (Review) అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకుండా ఓట్ల కోసం వస్తే, మహిళలు చెప్పులతో తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
మద్యపానంలో నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయి కొత్త బ్రాండ్స్ వచ్చాయని, మద్యం లేకపోతే వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) లేదన్నట్లు తయారైందని అనిత అన్నారు. మద్యం తయారీ మీద నాలుగేళ్లలో రూ. 38 వేల కోట్లు తాడేపల్లి కొంపకు చేరాయన్నారు. మహిళల తాళిబొట్లు, మానప్రాణాలతో ఆడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి లక్ష కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పిట్ట కథలు చెప్పారన్నారు. కేవలం రూ. 25 వేల కోట్ల ఆదాయం మద్యం మీదే వస్తోందన్నారు. రూ. 95 వేల కోట్ల మద్యాన్ని ప్రజలతో తాగించడాన్ని మద్యపాన నిషేధమంటారా? అని ప్రశ్నించారు. ఈరోజు మద్యం షాపులో క్యూఆర్ కోడ్ లేదంటే ఎలా దోచుకుంటున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. తాగుబోతులను కూడా తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఇదని వంగలపూడి అనిత అన్నారు.