TDP: వంగలపూడి అనిత హౌస్ అరెస్ట్.. మీడియాను కూడా రానీయకుండా బందోబస్తు

ABN , First Publish Date - 2023-09-11T15:07:27+05:30 IST

రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

TDP: వంగలపూడి అనిత హౌస్ అరెస్ట్.. మీడియాను కూడా రానీయకుండా బందోబస్తు

విశాఖపట్నం: రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను (TDP Leader Vangalapudi Anitha) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను నివాసం ఉంటున్న పాయకరావుపేటకు వెళ్లడానికి అనుమతి కోరినా.. గత మూడు రోజులుగా అనితను విశాఖలో గృహ నిర్బంధంలోనే ఉంచారు. దీనిపై ఏబీఎన్‌తో అనిత మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాల కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి టీడీపీని చూసి భయపడుతున్నారన్నారు. పోలీసులు లేకుండా ఏపీలో రోడ్లమీద తిరగలేని దుస్థితి వైసీపీది అని విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే.. ముఖ్యమంత్రి బాబే అని ధీమా వ్యక్తం చేశారు. 2024లో వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగలపూడి అనిత హెచ్చరించారు.

Updated Date - 2023-09-11T15:07:27+05:30 IST