Share News

Nara Lokesh : బాధిత మత్స్యకారులకు కొత్త బోట్లు, నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-11-20T10:13:01+05:30 IST

విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని పేర్కొన్నారు.

Nara Lokesh : బాధిత మత్స్యకారులకు కొత్త బోట్లు, నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి

అమరావతి : విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని నారా లోకేష్ కోరారు.

Updated Date - 2023-11-20T10:13:02+05:30 IST