Share News

B. Satyanarayana Murthy: వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఓటమి తప్పదు

ABN , First Publish Date - 2023-11-20T23:51:02+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సైకో జగన్ తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayana Murthy ) అన్నారు.

B. Satyanarayana Murthy: వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఓటమి తప్పదు

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సైకో జగన్ తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayana Murthy ) అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి నివాసంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్‌ను ఏర్పాటు చేశారు. కక్ష సాధింపు కోసం స్కిల్ కేసులో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. చివరకు న్యాయమే గెలిచింది...వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఓటమి తప్పదు’’ అని బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.

Updated Date - 2023-11-20T23:51:05+05:30 IST