YCP: ‘ఆమె సినిమాల్లో నటనకంటే అద్భుతంగా నటించింది’

ABN , First Publish Date - 2023-03-26T16:41:47+05:30 IST

వైసీపీ (YCP) సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) పై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మండిపడ్డారు.

YCP: ‘ఆమె సినిమాల్లో నటనకంటే అద్భుతంగా నటించింది’

విశాఖపట్నం: వైసీపీ (YCP) సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) పై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మండిపడ్డారు. ఎన్నికల రోజు ఆమె ఎంత హడావిడి చేశారో అందరూ చూశారని, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించారని ఆయన విమర్శించారు. ఉండవల్లి శ్రీదేవి కన్నా ఊసరవెల్లి శ్రీదేవి అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. నేరుగా పసుపు రంగు వేసుకుని తింటే బాగుండేదని విమర్శించారు. అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గుర్తొచ్చిందా? దొంగ చాటుగా రూ. పది కోట్లు, రూ. 15 కోట్లు డబ్బులు తీసుకుని ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఊసరవెల్లి‌లు అన్నీ కూడా పెద్ద ఊసరవెల్లి వద్దకు చేరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపాక వరప్రసాద్‌తో రూ.10 కోట్ల రూపాయలు ఇస్తాము ఓటు వేయమని అడిగారని చెప్పినప్పుడు, మళ్లీ అనుమానం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2023-03-26T16:49:27+05:30 IST