Anitha: జగన్ నిర్మాణాలన్నీ ప్రజల పరం కాక తప్పదు
ABN , First Publish Date - 2023-10-20T19:41:59+05:30 IST
జగన్ సర్కారుపై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జగన్ సర్కారుపై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం వేసిన జగన్ రెడ్డి.. తన విలాస భవనం నిర్మాణం కోసం రూ.400 కోట్ల ప్రజల సొమ్ము తగలేస్తున్నారు. బాత్రూమ్ నిర్మాణానికి రూ.25 లక్షలు ఖర్చుపెడుతున్న జగన్ రెడ్డి పేదవాడా?. రుషికొండను తన శాశ్వత నివాసస్థానంగా మార్చుకోవాలన్న ఆలోచనతోనే జగన్ దానిపై అంతభారీ భవనాలు నిర్మిస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది. ప్రజలసొమ్ము కొట్టేసి, ప్రభుత్వ సంపద కాజేసి మరీ జగన్ రెడ్డి అడ్డగోలుగా నిర్మిస్తున్న నిర్మాణాలన్నీ ఏదో ఒకరోజు ప్రజల పరం కాక తప్పదు. అమరావతిలో ప్రజల, ప్రభుత్వ అవసరాలకోసం చంద్రబాబునాయుడు నాడు చదరపు అడుగుకి రూ.6వేలు వెచ్చిస్తేనే నానా యాగీ చేసిన వైసీపీ నేతలు నేడు రుషికొండపై జగన్ నిర్మిస్తున్న భవన వ్యయంపై నోరెత్తరం?. జగన్ రెడ్డి తన సుఖాలకోసం తగలేస్తున్న రూ.400 కోట్ల ప్రజలసొమ్ముతో అన్నాక్యాంటీన్ల ద్వారా వేలమంది పేదల కడుపు నింపవచ్చు. అనేక గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించవచ్చు.. కానీ ఇలాంటివి చేయడానికి జగన్ రెడ్డికి మనసొప్పదు." అని అనిత మండిపడ్డారు.