SP Anburajan : పులివెందుల కాల్పుల కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ఎస్పీ

ABN , First Publish Date - 2023-03-28T22:18:13+05:30 IST

కడప (Kadapa) జిల్లా పులివెందులలో (Pulivendula) కాల్పుల ఘటన ప్రదేశాన్ని ఎస్పీ అన్బురాజన్‌ (SP Anburajan) పరిశీలించారు.

 SP Anburajan : పులివెందుల కాల్పుల కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ఎస్పీ

కడప: కడప (Kadapa) జిల్లా పులివెందులలో (Pulivendula) కాల్పుల ఘటన ప్రదేశాన్ని ఎస్పీ అన్బురాజన్‌ (SP Anburajan) పరిశీలించారు. కాల్పులు జరిపిన భరత్ (Bharat) తమ అదుపులో ఉన్నాడని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. భరత్, దిలీప్‌ మధ్య ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణమని ఎస్పీ అన్నారు. భరత్‌పై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. వివేకా కేసు నేపథ్యంలో తనకు ప్రాణహానీ ఉందని సీబీఐ డైరెక్టర్‌, కోర్టులను భరత్‌ ఆశ్రయించాడని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. అందుకే భరత్‌కు గన్‌ లైసెన్స్ మంజూరు చేయాల్సి వచ్చిందని ఎస్పీ అన్నారు.

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందులలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) అనుచరుడు భరత్ తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్ జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీ (TDP) కి చెందిన కార్యకర్త దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తెలుగు దేశం పార్టీకి చెందిన దిలీప్‌, బాషాపై భరత్‌ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో 4 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డాడు. ఛాతీపై కాల్పులు జరపడంతో టీడీపీ కార్యకర్త దిలీప్‌ ప్రాణాలు వదిలాడు. మరోవైపు తీవ్రగాయాలతో బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బుల వ్యవహారంలో ఇరువురిపై భరత్‌ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

భరత్‌ దగ్గర దిలీప్ అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. ఇదే విషయంపై దిలీప్‌ను డబ్బులు ఇవ్వాలంటూ భరత్ గట్టిగా నిలదీశాడు. ఈ డబ్బుల వ్యవహారంలో గొడవ చోటుచేసుకోవడంతో దిలీప్‌, బాషాపై భరత్‌ తుపాకీ తీసి కాల్పులకు పాల్పడ్డాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో దిలీప్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు భాషా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భరత్ మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అభిమానిగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య తర్వాత.. వివేకా కుటుంబానికి వ్యతిరేకంగా అనేక సార్లు భరత్ మీడియా సమావేశాలు కూడా నిర్వహించాడు. అలాగే వివేకా హత్య కేసులో కూడా గతంలో భరత్‌ను సీబీఐ ప్రశ్నించింది. అంతేకాదు వైఎస్‌ సునీతపై దుష్ప్రచారం చేయడంలో భరత్‌ కీలకపాత్ర పోషించాడు. ఎంపీ అవినాశ్‌రెడ్డికి భరత్‌ మద్దతుదారుడిగా ఉన్నాడు.

Updated Date - 2023-03-28T23:14:15+05:30 IST