AP Budget Session : టీడీపీ సభ్యులపై సీఎం ఫైర్.. 13 మంది సస్పెన్షన్..

ABN , First Publish Date - 2023-03-16T10:37:01+05:30 IST

డీపీ సభ్యలు 14 మందిని సభ నుంచి నేడు సస్పెండ్ చేస్తూ శాసనసభా వ్యవహరాల శాఖామంత్రి ప్రతిపాదించారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

AP Budget Session : టీడీపీ సభ్యులపై సీఎం ఫైర్.. 13 మంది సస్పెన్షన్..

AP Budget Session : టీడీపీ సభ్యులు (TDP Members) 13 మందిని సభ నుంచి నేడు సస్పెండ్ చేస్తూ శాసనసభా వ్యవహరాల శాఖామంత్రి ప్రతిపాదించారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ (CM Jagan).. సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్పీకర్ 13 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.

‘పలికెడిది భాగవతమట..పలికించెడివాడు రామభద్రుంట’ అంటూ బమ్మెర పోతన రచించిన పద్యాన్ని ఉటంకించి శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) ప్రవేశపెడుతున్నారు. ఒక శతాబ్దం క్రితం గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘నిరంతరం కార్యదీక్ష, విశాలదృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా .. ఆ స్వేచ్ఛగా విహరించేలా నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రీ’ సందేశాన్ని సైతం ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తావించారు.

Updated Date - 2023-03-16T10:57:40+05:30 IST