Share News

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

ABN , First Publish Date - 2023-12-01T16:09:59+05:30 IST

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

కాకినాడ: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. దివ్యాంగులపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్కరికి కూడా మూడు చక్రాల మోటార్ సైకిల్, పనిముట్లు ఇవ్వలేదన్నారు. స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలు చేస్తామన్నారు. దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.

Updated Date - 2023-12-01T16:10:00+05:30 IST