Share News

AP HighCourt: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2023-11-21T16:37:49+05:30 IST

మద్యం కంపెనీల అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

AP HighCourt: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

అమరావతి: మద్యం కంపెనీల అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో (AP High Court) మంగళవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ నాగ ముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని.. ఆ సమయంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు అభ్యంతరాలు చెప్పలేదన్నారు. రాజకీయ కారణంతో కేసు నమోదు చేశారని నాగముత్తు తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు నిర్ణయం కూడా నిబంధనల ప్రకారమే తీసుకున్నారన్నారు. సీనియర్ అడ్వకేట్ నాగముత్తు వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. సీఐడీ తరుపు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.

Updated Date - 2023-11-21T16:37:50+05:30 IST