Dharmana: అందుకు సీఎం జగన్ ఒప్పుకోవట్లేదు

ABN , First Publish Date - 2023-01-03T16:22:20+05:30 IST

సైకిల్ పోవాలని చంద్రబాబే (Chandrababu) స్వయంగా పిలుపునిస్తున్నారని.. ఇక సైకిల్‌కి ఓటేయమని చెప్పేదెవరు? అని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్

Dharmana: అందుకు సీఎం జగన్ ఒప్పుకోవట్లేదు
జగన్ ఒప్పుకోవట్లేదు

శ్రీకాకుళం: సైకిల్ పోవాలని చంద్రబాబే (Chandrababu) స్వయంగా పిలుపునిస్తున్నారని.. ఇక సైకిల్‌కి ఓటేయమని చెప్పేదెవరు? అని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకుంటాని సీఎంకు స్వయంగా చెప్పాను. రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుందని ముఖ్యమంత్రికి చెప్పా. కానీ అందుకు సీఎం జగన్(Cm jagan) ఒప్పుకోలేదు. ఈ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయమని జగన్ కోరారు. దీనిపై ఆలోచన చేయడానికి ఇంకా టైం ఉంది. నాతో పనిచేసిన వారందరూ కూడా ఎదగాలి. మా భాద్యత కూడా తర్వాత తరానికి నాయకులను తయారు చేసి సమాజానికి అందించాలి . దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తా.’’ అని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-03T16:22:22+05:30 IST