Minister Adimulapu: ఆధార్ సీడింగ్ ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చు

ABN , First Publish Date - 2023-08-23T12:46:47+05:30 IST

ప్రకాశం జిల్లా: టెక్నాలజీ చాలా తెలుసునని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. దాని ద్వారానే దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చుకదా అని.. ఆధార్ సీడింగ్ ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Minister Adimulapu: ఆధార్ సీడింగ్ ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చు

ప్రకాశం జిల్లా: టెక్నాలజీ చాలా తెలుసునని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu).. దాని ద్వారానే దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చుకదా అని.. ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding) ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) అన్నారు. బుధవారం మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నగదు బదిలీలో వందలు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. బీఎల్వోలతో పాటు ఇంటింటి సర్వేకి అన్నీ పార్టీలు వెళ్తున్నాయని, దొంగ ఓట్లు ఉంటే తెలిసిపోతుందన్నారు.

తెలంగాణా బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇక్కడ ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని మంత్రి ఆదిమూలపు అన్నారు. వైసీపీ (YCP)ని మరోసారి అధికారంలోకి రాకుండా చేయలని అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘తరిమి తరిమి కొడతాం.. బట్టలూడ దీసి కొడతాం’ అంటూ మహిళలు ఉన్నారని కూడా చూడకుండా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఎర్రడైరీ ఉంది.. పచ్చ డైరీ’ ఉందంటూ అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతల మాటలు ఉన్నాయని, పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారన్నారు. గతంలో ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలే హైప్ కోసం కావాలని చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేసుకున్నారని, ఎర్రగొండపాలెంలో రాళ్లదాడిలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి ఆదిమూలపు సరేష్ అన్నారు.

Updated Date - 2023-08-23T12:46:47+05:30 IST