Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు

ABN , First Publish Date - 2023-04-30T14:05:22+05:30 IST

రూ.8.98 కోట్లతో గుడివాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు

అమరావతి : రూ.8.98 కోట్లతో గుడివాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన ముఖ్యమంత్రి జగన్... ఆ శాఖకు ఊపిరి పోశారన్నారు. రాజకీయాల్లో పాదరసం కంటే కూడా వేగంగా ఆలోచించే మేధావి కొడాలి నాని అని కొనియాడారు. పోటీగా వచ్చే వారిని ఓడించడానికి కొడాలి నాని స్కెచ్ వేశారన్నారు. రాష్ట్ర ప్రజల్లో జగన్ ఎలా ఉన్నారో... గుడివాడ ప్రజల్లో కొడాలి నాని అలాగే పదిలంగా ఉన్నాడని పేర్ని నాని పేర్కొన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని.. పార్టీ పెట్టాడన్నారు. చంద్రబాబుకు మేలు చెయ్యడమే పవన్ కల్యాణ్‌కు ముఖ్యమని పేర్ని నాని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-30T14:05:22+05:30 IST