Anam Vs Mekapati: ఎమ్మెల్యే ఆనంకు మేకపాటి సవాల్

ABN , First Publish Date - 2023-06-05T16:18:15+05:30 IST

ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం.. రా అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదన్నారు.

Anam Vs Mekapati: ఎమ్మెల్యే ఆనంకు మేకపాటి సవాల్

నెల్లూరు: ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం.. రా అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి (MLA Anam Ramnarayana reddy) వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి (YCP MLa Mekapati Vikram reddy) సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఆ పెద్దమనిషి మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో చేసింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. నాటు సారా తయారు చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని మద్యం గురించి ఆనం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వాలంటీర్లకి, గృహ సారధులకి మధ్య తేడా తెలియకుండా మాట్లాడకూడదన్నారు. వైసీపీ మేనిఫెస్టోని కాపీ చేసిన పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని, మరో శ్రీలంకలా అయిపోతుందని టీడీపీ అనడం శోచనీయమని మేకపాటి విక్రమ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-05T16:18:15+05:30 IST