Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2023-09-27T16:37:35+05:30 IST

నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..

Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Skill Development Corporation) కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ (YCP) సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే (Rural MLA) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) సవాల్ చేశారు. మధ్యవర్తులుగా మేధావులను (జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మినారాయణ) తీసుకురావచ్చునని, లేదా వైసీపీకి నచ్చిన వారిని తేవచ్చునని అన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంటర్లకు మీడియాతో సహా వస్తే అక్కడే లెక్కలు తెలుస్తామన్నారు. ఈ బహిరంగ చర్చకు సాక్షి పేపరు, టీవీ వచ్చినా పర్వాలేదని తమకు అభ్యంతరం లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

అనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) మాట్లాడుతూ.. ఇక్కడే డాక్టరెట్ తీసుకొని.. ఒక్కసారి కూడా మంత్రి కాకాని (Minister Kakani) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పరిశీలించలేదని విమర్శించారు. సీఎం జగన్ (CM Jagan) కళ్ళలో ఆనందం కోసం స్కిల్ డెవలప్‌మెంట్ బోగస్ అని మంత్రి అంటున్నారని, దోపిడీ వాస్తవం అయితే, 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. అవాస్తవమైన మాటలతో విద్యాసంస్థలపై నిందలు మోపుతున్నారని ఆయన మండిపడ్డారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ 34 పాలిటెక్నీకల్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, కీయ మోటార్స్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను అఖిలపక్షం పర్యటిస్తామంటే అనుమతివ్వడం లేదని మండిపడ్డారు. 2019లో దేశంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఏపీకి మెదటి స్థానం వచ్చిందన్నారు. ఏ కంపెనీకి ఎంత ఇచ్చారన్నది అధికారంగా లెక్కల్లో ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో పరికరాలు, వసతులు, సామాగ్రీ, నిర్మాణాలు ఆధారాలతో సహా ఉన్నాయని, లక్షలాది మంది పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, ఎర్రమట్టి తినడంతో మంత్రి తల పని చేయడంలేదని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2023-09-27T16:41:44+05:30 IST