Narayana: చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారు

ABN , First Publish Date - 2023-09-18T08:49:55+05:30 IST

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు రేపు కచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Narayana: చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారు

నెల్లూరు: చంద్రబాబుపై (Chandrababu) అక్రమ కేసు, అరెస్టుని నిరశిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి నారాయణ (Ex minister Narayana) అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు రేపు కచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌తో (Nara lokesh) పాటు ముఖ్య నేతలపై వరసగా ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయమన్నారు. వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) పోరాటం కొనసాగిస్తామని నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T08:49:55+05:30 IST