Share News

Anam Rannarayana Reddy: రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదు

ABN , First Publish Date - 2023-11-14T16:40:17+05:30 IST

రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ( Anam Rannarayana Reddy ) అన్నారు.

Anam Rannarayana Reddy: రైతు సమస్యలపై  జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదు

నెల్లూరు: రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ( Anam Rannarayana Reddy ) అన్నారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘జిల్లా రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వం ఆలోచించడం లేదు.32 టీఎంసీల నీటిని అధికారులు సముద్రం పాలు చేశారు. మూడేళ్లుగా కాలువలు పూడిక తీయలేదు. 30 ఐఏబీ మీటింగులు చూశా.. ఇలాంటి సమావేశం చూడలేదు..మంత్రి, కలెక్టర్ ఉన్నప్పుడే అధికారులు నీసిగ్గుగా సమాధానం చెబుతున్నారు. అధికారులు నన్ను పునశ్చరణ చేసుకోమన్నారు బాధాకారంగా ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు వదిలి వెనక్కు వెళ్లిపోయారు. డబ్బులు లేక ప్రొజాక్ట్, కాలువల పనులు నిలిపేశామని అధికారులు చెబుతున్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పునశ్చరణ చేసుకోవాలని చెబుతుంటే బాదేసింది. మా లాంటి సీనియర్లను మంత్రి, కలెక్టర్, సహచర ఎమ్మెల్యే మధ్య అవమానించడంపై సమావేశన్ని బాయ్ కాట్ చేసి బయటకు వచ్చాను’’ అని ఆనం రాంనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-14T16:40:47+05:30 IST