Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2023-06-22T19:32:06+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan MohanReddy) టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

తిరుపతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan MohanReddy) టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. జగన్‌ విశాఖను నేర సామ్రాజ్యం చేశారని, జగన్‌ పాలనలో వైసీపీ ఎంపీకే రక్షణ లేదని విమర్శించారు. ఏపీలో పూటకో అత్యాచారం, గంటకో హత్య జరుగుతోందని, అఘాయిత్యాలకు రేటు కడుతున్నారే తప్ప.. అరికట్టట్లేదని మండిపడ్డారు.

నేరాలపై చర్యలు తీసుకోకుండా ఆర్జీవీ సినిమాపైనే జగన్‌ సమీక్ష చేశారని, సైకో జగన్‌రెడ్డిని ప్రజలే తరిమికొట్టాలని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు సంపద సృష్టిస్తే, జగన్ అప్పులు చేస్తున్నారని, చంద్రబాబు విజనరీ అయితే.. జగన్ ప్రిజనరీ అని లోకేష్ అన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ భారం మోపారని, జగన్‌కు మైతో మేనియా సిండ్రోమ్ జబ్బు ఉందన్నారు.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడమే ఆ జబ్బు లక్షణమన్నారు. రూ.లక్ష కోట్ల ఆస్తి, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే జగన్‌.. తనకు తానే పేదవాడు అని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌, బెంగళూరులో ప్యాలెస్‌లు ఉండే వ్యక్తి పేదవాడా? సొంత ఛానల్‌, సొంత పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడా? అని లోకేష్ ప్రశ్నించారు.

సీఎం జగన్‌రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని, జగన్‌ ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ పాదయాత్ర 134వ రోజుకు చేరింది. వెంకటగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra) కొనసాగుతోంది.

Updated Date - 2023-06-22T19:39:52+05:30 IST