Kurnool: మాజీమంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్

ABN , First Publish Date - 2023-05-24T15:49:09+05:30 IST

కర్నూలు: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ కోసం పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూలు కోర్టు తోసిపుచ్చింది.

Kurnool: మాజీమంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్

కర్నూలు: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ (Bhuma Akila Priya)కు కోర్టు (Court) బెయిల్ (Bail) మంజూరు చేసింది. కస్టడీ (Custody) కోసం పోలీసులు వేసిన పిటిషన్‌ (Petition)ను కర్నూలు కోర్టు తోసిపుచ్చింది. ఇటీవల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)పై దాడి కేసులో అఖిల ప్రియను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె కర్నూలు మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

భూమా అఖిల ప్రియకు 7 నెలల బాలుడు ఉన్నాడు. అందుచేత బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు నంద్యాల కోర్టు (Nandyala Court)లో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మళ్లీ కర్నూలు కోర్టులో న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భూమా అఖిల ప్రియను కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో మరి కాసేపట్లో అఖిల ప్రియ కర్నూలు మహిళా సబ్ జైల్ నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల నుంచి అఖిల ప్రియ కార్యకర్తలు, అభిమానులు కర్నూలుకు బయలుదేరారు.

కాగా ఈ నెల 16న రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో (Yuvagalam Padayatra) టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి .. అఖిల ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఖిలప్రియపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-24T15:49:09+05:30 IST