Chandrababu: మందు బాబులకు చంద్రబాబు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2023-08-01T15:48:36+05:30 IST

నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. మద్యం చార్జీలు తగ్గిస్తానని, మంచి మద్యం ఇస్తానని స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల, నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...

Chandrababu: మందు బాబులకు చంద్రబాబు గుడ్ న్యూస్

నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. మద్యం చార్జీలు తగ్గిస్తానని, మంచి మద్యం ఇస్తానని స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల (Nandyala), నందికొట్కూరు (Nandikotkur) బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంటు (Current) ఉత్పత్తిలో నూతన విధానాన్ని తీసుకొచ్చి కరెంటు చార్జీలు తగ్గిస్తానన్నారు. యువగళం (Yuvagalam)కు మంచి ఊపు వచ్చిందని, ఏ ఊరికి వెళ్లినా జాబ్ (Job) రావాలంటే బాబు (Babu) రావాలని యువత అంటున్నారన్నారు. ఆరు నెలలు కస్టపడితే మీ జీవితాల్ని బాగు చేస్తానన్నారు.

దేశంలోనే ఎక్కువగా రైతులు (Farmers) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఏడాదికి ఇరవై వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సైకో ముఖ్యమంత్రి జగన్ (Psycho Chief Minister Jagan) తన వయసు గురించి, తన క్యారెక్టర్ (Character) గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా’నని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తానని, ముందు ఇరవై ఏళ్లకు కావాల్సిన వాటిపై ఆలోచిస్తానని చెప్పారు. సీఎం జగన్ రోజుకు ఒక గంటైనా పని చేస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని, 2019లో సైకో జగన్ రాక పోయింటే ఏపీ (AP), తెలంగాణ (Telangana)కు సమానంగా అభివృద్ధి చెందేదన్నారు. నందికొట్కూరులో మాదిగలకు, బుడగ జంగాలకు న్యాయం చేస్తానని చెప్పారు. వాటర్ ట్యాంక్‌లలో బాంబులు పెట్టుకునే వైసీపీ నేతలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నారని, వైసీపీ అంటే కరప్షన్ పార్టీగా అభివర్ణించారు. నీటి ఆవశ్యకత కోసం తాను చేపట్టిన ప్రాజెక్టుల యుద్ధం గురించి అందరికీ చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-01T15:48:36+05:30 IST