AP News: ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులకు లోకేశ్ ఇచ్చిన హామీ ఇదే

ABN , First Publish Date - 2023-05-16T22:06:46+05:30 IST

టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh)ను ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులు కలిశారు.

AP News: ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులకు లోకేశ్ ఇచ్చిన హామీ ఇదే

కర్నూలు: టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh)ను ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులు కలిశారు. బండిఆత్మకూరు శివారు క్యాంపు సైట్లో లోకేశ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. ఉద్యోగులను జగన్రెడ్డి దారుణంగా మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) పాలనలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంతంగా లేరని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎంఆర్- టైమ్ స్కేలు ఉద్యోగుల పోరాటానికి అండగా నిలుస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-05-16T22:06:46+05:30 IST