AP News: పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2023-02-04T11:40:22+05:30 IST

అమరావతి: బంగారుపాళ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) రాష్ట్ర డీజీపీ (DGP)కి లేఖ రాశారు.

AP News: పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి వర్ల రామయ్య లేఖ

అమరావతి: బంగారుపాళ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) రాష్ట్ర డీజీపీ (DGP)కి లేఖ రాశారు. లోకేష్‌ పాదయాత్ర (Lokesh Padayatra)లో డీజీపీ నిర్దేశించినట్లు.. పోలీసులు పనిచేయడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. లోకేష్ పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే.. విద్యుత్ నిలిపివేశారని, 3 వాహనాలు సీజ్ చేశారన్నారు. కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై.. లోకేష్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారని బాధ్యులైన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా నిన్న బంగారుపాళ్యంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సౌండ్ సిస్టం వాహనం, ప్రచార రథం, వీడియో కవరేజ్‌కు ఏర్పాటు చేసిన లైవ్ వెహికల్‌లను సీజ్ చేశారు. ఆ వాహనాలను గంగవరం రూరల్ సబ్ డివిజన్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. దీంతో ప్రచారానికి టిడిపి శ్రేణులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రచారంలో పాదయాత్రలో ఇలాంటి మైకులు వాడకూడదు అంటూ పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. పోలీసులు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నారా లోకేష్‌పై కేసు నమోదు

పూతలపట్టు నియోజకవర్గంలో అవినీతి

కాగా నిన్న పూతలపట్టు నియోజకవర్గంలో అవినీతి ఫుల్లుగా ఉందంటూ స్థానిక ఎమ్మెల్యేపై నారా లోకేశ్‌ నిప్పులు చెరిగారు. మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి బినామీగా వ్యవహరిస్తున్న ఎంఎస్ బాబు.. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బంగారుపాళ్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లలోషిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని 50 మంది నుంచి రూ.5 లక్షలు చొప్పున వసూలు చేశారని, ఆధారాలు కూడా తనకు కొందరు అందజేశారన్నారు. బంగారుపాళ్యం మండలంలో అక్రమ క్వారీలు నడుపుతున్నారన్నారు. పూతలపట్టులో మరో బినామీ శ్రీకాంత్‌ రెడ్డి ఇసుక దందా సాగిస్తున్నారని, గంగాధరనెల్లూరులో బరో బినామీ ఆనందరెడ్డి కల్తీ మద్యం తయారు చేసి నియోజక వర్గంలో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. చామంతి రిజర్వాయర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, కనీసం జీవో కూడా తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎమ్మెల్యే పని అయిపోయిందని, ఈ సారైనా పూతలపట్టు అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ధరలు తగ్గాలన్నా.. సైకోపాలన పోయి, సైకిల్‌ పాలన రావాలన్నారు. పూతలపట్టులో గత మూడు ఎన్నికల్లో టీడీపీ ఓడిందని ఈ సారి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఏనుగుల బెడద అధికంగా ఉందని, మామిడికి గిట్టుబాటు ధరలేకరైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రాగానే గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. ఏనుగుల నిరోధానికి కంచె ఏర్పాటు, కందకాలు తవ్వుతామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-02-04T11:40:25+05:30 IST