TDP: అనగాని సత్యప్రసాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-09-09T16:18:51+05:30 IST

రేపల్లె మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Satya Prasad) గన్నవరం ఎయిర్‌ పోర్టులో(Gannavaram Airport) పోలీసులు అడ్డుకున్నారు.

TDP: అనగాని సత్యప్రసాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

కృష్ణాః రేపల్లె మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Satya Prasad) గన్నవరం ఎయిర్‌ పోర్టులో(Gannavaram Airport) పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకి అనగాని సత్యప్రసాద్ వచ్చారు. కాగా సత్య ప్రసాద్‌ ఎయిర్‌ పోర్టు నెంచి బయటకు వెళ్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సత్యప్రసాద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గన్నవరం ఎయిర్‌ పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా సత్య ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నేను పని మీద వచ్చాను నన్ను అడ్డుకునే రైట్స్ మీకు లేవు అని చెప్పారు. సత్య ప్రసాద్ వాహనానికి ముందు పోలీసులు పోలీస్ వాహనం అడ్డుపెట్టారు. సత్యప్రసాద్ వాహనంతో సహా గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-09T16:18:51+05:30 IST