Pawan Kalyan: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం సంతోషం

ABN , First Publish Date - 2023-09-19T06:53:44+05:30 IST

అమరావతి: చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిధ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Pawan Kalyan: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం సంతోషం

అమరావతి: చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిధ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)కు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

చట్ట సభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధాని మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారని పవన్ కొనియాడారు. ఈ బిల్లు చట్టసభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరని, ఈ బిల్లును చట్ట సభల సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదిస్తారని ఆశిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

Updated Date - 2023-09-19T07:55:02+05:30 IST