Minister Karumuri: మళ్ళీ జగన్‌కు 175 సీట్లు రావడం ఖాయం: మంత్రి కారుమూరి

ABN , First Publish Date - 2023-04-11T17:22:09+05:30 IST

ఢిల్లీ: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswararao) మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిశారు.

Minister Karumuri: మళ్ళీ జగన్‌కు 175 సీట్లు రావడం ఖాయం: మంత్రి కారుమూరి

ఢిల్లీ: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswararao) మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించానన్నారు. మంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకున్నానన్నారు. ఏడాది కాలంలో సివిల్ సప్లై (Civil Supply) మంత్రిత్వశాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చామన్నారు. రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు రైతులకు సరైన పంట ధర వచ్చేలా చేశామని, నేరుగా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్నామని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

ఇంటింటికి రేషన్ పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ని కేంద్ర మంత్రి ప్రశంసించారని మంత్రి కారుమూరి అన్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చిట్ ఫండ్ కంపెనీ విషయంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) సీఎం జగన్‌ (CM Jagan)ను విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. మళ్ళీ జగన్‌కు 175 సీట్లు రావడం ఖాయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ (Visakha Steel Plant Bidding) జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని, లేకపోతే తామే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సాధించుకునే ప్రయత్నం చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పోరాడుతున్నారని, లాస్ట్ బాల్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అసలు కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో తెలియదన్నారు. కిరణ్‌ను సీఎంను చేసిన కాంగ్రెస్ (Congress) అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఏపీలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆపై ఎంత వచ్చిన సేకరిస్తామన్నారు. కొందరు మళ్ళీ గెలవలేరని, మంత్రి పదవుల కోసం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ (Lokesh), చంద్రబాబు (Chandrababu) ప్రభావం ఉండదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-11T17:22:09+05:30 IST