Jawahar: ఎమ్మెల్యే అనిల్‌కు నోటి బలుపు..
ABN , First Publish Date - 2023-06-26T14:35:47+05:30 IST
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumrar Yadav)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనిల్ నోటి బలుపుతో విర్రవీగుతున్నారని, నారా లోకేష్ (Nara Lokesh) తాత తండ్రుల గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదన్నారు. లోకేష్ అభ్యుదయవాద భావజాలం వున్నవ్యక్తి అని.. ఆయన ఆలోచన అవగాహన అనిల్ లాంటి బజారు మనుషులకు అర్ధంకాదన్నారు.
లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ మతిభ్రమణతో మాట్లాడుతున్నారని జవహర్ అన్నారు. అనిల్ నెల్లూరుకు చేసిందేంటో ప్రజలకు తెలుసునని అన్నారు. నీటి పారుదలశాఖ మంత్రిగా రాష్ట్రానికి చేసింది శూన్యమని, ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ ఏపీ రాష్ట్ర భవిష్యత్‌కు టార్చ్ బేరర్ అని, అనిల్‌కు బాధవుంటే అంతర్గతంగా తేల్చుకోవాలన్నారు. ఇకనైనా లోకేష్‌పై అవాకులు చెవాకులు పేలటం ఆపాలని జవహర్ సూచించారు.