MP Magunta ED Enquiry: కవిత బాటలో వైసీపీ ఎంపీ.. ఈడీ రమ్మన్న టైం దాటిపోయినా...

ABN , First Publish Date - 2023-03-18T13:17:57+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు.

MP Magunta ED Enquiry: కవిత బాటలో వైసీపీ ఎంపీ.. ఈడీ రమ్మన్న టైం దాటిపోయినా...

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam) లో నోటీసులు అందుకున్న వారు ఈడీ (ED) ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఈనెల 16న ఈడీ ముందు హాజరుకావాల్సి ఉండగా.. చివరి వరకు సస్పెన్స్ కొనసాగించారు. చివరకు ఈడీ విచారణకు హాజరుకాలేనని, మరో తేదీని ఇవ్వాలంటూ తన ప్రతినిధి ద్వారా ఈడీకి కవిత సమాచారం అందించారు. ఈ క్రమంలో 20న మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ ద్వారా నోటీసులు అందుకున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (YCP MP Magunta Srinivasulu Reddy) ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి (YCP MP) ఈడీ ముందు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకే హాజరుకావాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1 గంట వరకూ ఈడీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ చేరుకోని పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి అరుణ్ పిళ్ళై - మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిపి ఈడీ ప్రశ్నించాల్సి ఉంది. ఇప్పటికే బుచ్చిబాబు నుంచి ఎన్ఫోర్స్‌మెంట్ కీలక సమాచారాన్ని సేకరించింది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని (Magunta Raghava Reddy) ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సాత్‌గ్రూప్‌ (South Group) లో కీలక పాత్ర పోషించినట్లు రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి తిహార్ జైల్‌ (Tihar Jail)లో ఉన్నారు.

Updated Date - 2023-03-18T14:00:28+05:30 IST