Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2023-09-05T16:20:44+05:30 IST

కర్ణాటక: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బళ్లారిలో కమ్మ భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.

Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

కర్ణాటక: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బళ్లారిలో కమ్మ భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statue) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన బళ్ళారిలో మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాల సందర్భంగా బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి... మహనీయుడు అని అన్నారు. విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం చాలా సంతృప్తినిస్తోందన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. సినీ రంగంలో ఆయన చేసిన పాత్రలు.. ఒక వేంకటేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, భీముడు, దుర్యోధనుడు ఇలా ఏదీ చూసినా ఆది ఆయనకే చెల్లుబాటని వేరే ఎవరూ చేయలేరని.. అదే ఎన్టీ రామారావు ప్రత్యేకతని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని.. ఎవరైనా అలాంటివారు రావాలంటే మళ్లీ ఎన్టీఆరే పుడితే తప్ప ఎవరూ చేయలేరని అన్నారు. చివరిగా జై ఎన్టీఆర్.. జై కర్ణాటక అంటూ చంద్రబాబు అభివాదం చేశారు.

అంతకుముందు చంద్రబాబు జిందాల్ విమానాశ్రయానికి చేరుకోగానే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కమ్మ సంఘం నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు కాన్వాయి వెంట వందలాది వాహనాలతో వెళ్లారు.

Updated Date - 2023-09-05T16:20:44+05:30 IST