Chandrababu: ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారు..

ABN , First Publish Date - 2023-02-03T14:03:13+05:30 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

Chandrababu: ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారు..

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమ నిర్వహణ, మెంబర్ షిప్ (Membership), ఓటర్ (Voter) వెరిఫికేషన్‌తో పాటు పలు అంశాలపై సమీక్ష (Review) జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌ (CM Jagan)కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు జీవో నెంబర్ 1 తేవడం.. రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి పట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి అడుగడుగునా రాజీ పడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్ కోసమే కానీ...రాష్ట్రం కోసం కాదని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరువు జిల్లాలకు నిధులు సహా ఒక్క అంశంలో కూడా వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయిందని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ విషయంలో సీఎం జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని ఆరోపించారు.

కనీసం ఈ హామీ అయినా జగన్ నిలబెట్టు కోవాలి...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీఎం జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని, తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబంవైపే చూపుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అందరు రాజకీయ నాయకుల కంటే ధనికుడైన జగన్... పేదల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు.

సీఎం జగన్ ఒక స్కీం పెట్టారంటే.. అందులో సొంత స్కామ్ ఉంటుందని.. అందుకు జె బ్రాండ్స్ మద్యం, ఇసుక విధానం ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలను నిత్యం దోచుకుంటూ.. ఎన్నికలు వస్తున్నాయని... పేదల గురించి చెపితే జనం నమ్మరన్నారు. పార్టీ నేతలు రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఏప్రిల్ 15 వరకు ఇదేం ఖర్మ కార్యక్రమం పూర్తి చెయ్యాలని ఇంచార్జులకు చంద్రబాబు సూచించారు.

Updated Date - 2023-02-03T14:03:17+05:30 IST