Ramesh Naidu: కనీసం ఈ హామీ అయినా జగన్ నిలబెట్టు కోవాలి...

ABN , First Publish Date - 2023-02-03T12:24:37+05:30 IST

విజయవాడ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ అందరికీ మేలు‌ చేసెలా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

Ramesh Naidu: కనీసం ఈ హామీ అయినా జగన్ నిలబెట్టు కోవాలి...

విజయవాడ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitaraman) బడ్జెట్ అందరికీ మేలు‌ చేసెలా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagotu Ramesh Naidu) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనరంజక పాలన చేస్తానని, అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ (Toll Free) నెంబర్ పెడతానని జగన్మోహన్ రెడ్డి (CM Jagan) హామీ ఇచ్చారన్నారు. మరి వైసీపీ నాయకుల (YCP Leaders) అవినీతి తెలపడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కనీసం ఈ హామీ అయినా సీఎం జగన్ నిలబెట్టు కోవాలన్నారు.

వివేకా హత్యకేసు.. దూకుడు పెంచిన సీబీఐ

మద్య నిషేధం అన్న జగన్... ఇవాళ రాష్ట్రం మొత్తం ఏరులై పారిస్తున్నారని నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. పేదల మహిళల పుస్తెలు తెంపే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు అన్న జగన్... వారిని మోసం చేశారని, జాబ్ క్యాలెండర్‌ లేదు... జాబ్ లెస్ క్యాలెండర్‌‌తో మభ్య పెట్టారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావాలని ఏరి కోరి గెలిపించిన ఉద్యోగుల హక్కులను కూడా హరించారన్నారు. ప్రతి నెలా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

రైతులకు మేలు చేస్తామన్న సీఎం జగన్..‌ ఉన్న పథకాలు కూడా పీకేశారని నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. మార్కెటింగ్ వ్యవస్థలో మెళకువలు నేర్చుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గరకు‌ వెళ్లండన్నారు. ప్రజల సొమ్ముతో తన పత్రిక, ఛానల్‌లో కోట్ల రూపాయల యాడ్‌లు ఇచ్చుకుంటున్నారని, అవినీతి అనేది‌ వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు. సీఎం చుట్టూ ఉన్న‌ వారంతా అవినీతిలో అగ్రగణ్యులేనన్నారు. ప్రతిపక్షాలే కాదు.. న్యాయమూర్తులపై కూడా డేగ కన్ను పెట్టారని ఆరోపించారు.

సీఎం జగన్ విధానాల వల్ల ఏపీ అన్ని‌విధాలా నాశనం అయిందని నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా యధేచ్చగా నడుస్తోందని, గతంలో కేసులు పెట్టే వారు... ఇప్పుడు అది కూడా లేకపోవడం... ‌విచ్చలవిడి తనంగా మారిందన్నారు. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి చెప్పనవసరంలేదన్నారు. పోలీసు వ్యవస్థకు అన్నీ తెలిసినా నిద్ర నటిస్తోందని విమర్శించారు. ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రిని సాగనంపాలని పిలుపిచ్చారు. ప్రస్తుతం ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి బలం పెరుగుతోందని, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై బీజేపీ ప్రజా పోరు రెండో‌విడత చేపడతామని నాగోతు రమేష్ నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-03T12:24:41+05:30 IST