Kadapa: వివేకా హత్యకేసు.. దూకుడు పెంచిన సీబీఐ

ABN , First Publish Date - 2023-02-03T11:09:09+05:30 IST

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Vivekananda Reddy Murder Case)లో సీబీఐ (CBI) దూకుడు పెంచింది.

Kadapa: వివేకా హత్యకేసు.. దూకుడు పెంచిన సీబీఐ

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Vivekananda Reddy Murder Case)లో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. సీబీఐ ప్రత్యేక బృందం శుక్రవారం కడపకు చేరుకుంది. అధికారులు పులివెందులలో పర్యటించి కొన్ని ప్రదేశాలను పరిశీలించి మరి కొందరు అనుమానితులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అదానీ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

కాగా వివేక హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సీఎం జగన్‌ (CM Jagan) సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి నోటీసు (Notice) ఇచ్చి విచారించింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) టెన్షన్‌ (Tension) పడుతున్నట్లు అర్థమవుతోంది. సీబీఐ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి సీఎంలో టెన్షన్‌ (Tension) మొదలైంది. కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకు పరిపాలన గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి (R.Srinivasa Reddy) ఆరోపించారు.

వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేయడంతో.. ఈ విచారణ ఎక్కడకి వెళుతుందో, ఎవరి వద్ద ఆగిపోతుందో తెలియదని శ్రీనివాసరెడ్డి అన్నారు. దీన్ని డైవర్ట్‌ చేసేందుకు విశాఖపట్టణం రాజధాని (Visakhapatnam Capital) అంటూ సీఎం జగన్‌ డైవర్ట్‌ పాలిటిక్స్‌ (Divert Politics) కు తెర తీశారని విమర్శించారు. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉందని.. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఎలా మాట్లాడాలో తెలియదా? అని ప్రశ్నించారు. అమరావతిలో రూ. 10వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. అమరావతినే రాజధాని అంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వలేదని, అలాంటప్పుడు ఎలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇది కోర్టు ఉల్లంఘన కింద రాదా అని అన్నారు. ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక సదస్సులో వైజాగ్‌ రాజధాని అని సీఎం జగన్ చెప్పడంతో ‘‘ఓహో మీకు రాజధాని లేదా, అయితే మీకు అన్ని వసతులు కుదిరాక చూద్దాంలే’’.. అన్న తరహాలో పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాయన్నారు. జగన్‌ వ్యవహారశైలి, ఆయన మాటల కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూడడం లేదన్నారు.

మూడు నెలలకు రూ.4,300 కోట్లు అప్పు తీసుకోవాల్సి ఉండగా.. ఆ గడువు కూడా ముగిసిందని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ పాలనపై సొంత పార్టీ నేతలే బండబూతులు తిడుతున్నారని, అంతా గందరగోళంగా తయారైందని విమర్శించారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలైందని, ఎన్నికలకు ఏడాది ముందే పార్టీని వదిలేసి పక్కకుపోతున్నారన్నారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని జనం సిద్ధమయ్యారని, కనీసం డైవర్ట్‌ పాలిట్రిక్స్‌ను వదిలేసి ఓట్లేసిన ప్రజల కోసం ఈ ఏడాదైనా పాలన చేయాలంటూ శ్రీనివాసరెడ్డి సూచించారు.

Updated Date - 2023-02-03T11:09:12+05:30 IST