Rama Chandra Yadav: ఈ నాలుగేళ్లలో జగన్రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశారు
ABN , First Publish Date - 2023-11-20T21:26:05+05:30 IST
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లక్షా 60వేల కోట్లు దోపిడికి పాల్పడ్డారని పులివెందుల పోలీసుస్టేషన్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామ చంద్ర యాదవ్ ( Rama Chandra Yadav ) ఫిర్యాదు చేశారు.

కడప: జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లక్షా 60వేల కోట్లు దోపిడికి పాల్పడ్డారని పులివెందుల పోలీసుస్టేషన్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామ చంద్ర యాదవ్ ( Rama Chandra Yadav ) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచిన జగన్ నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈ నాలుగేళ్లలో జగన్రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఘనులు, మద్యం, ఇసుక అన్ని రంగాల్లో దోచుకున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. జగన్ దోపిడి మీద విచారణ చేసి కేసు నమోదు చేయాలి. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం వల్లే దోపిడీకి పాల్పడ్డారు. అందుకే పులివెందుల స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాం. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగిన పులివెందుల సంస్కృతి అని చెడ్డపేరు వస్తోంది. దీనికి జగన్మోహన్రెడ్డే కార ణం. తనకు అడ్డు వస్తే సొంత చిన్నాన్నను అడ్డు తొలగించుకోవడానికి కూడా జగన్ వెనుకాడలేదు. జగన్ దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేయాలి’’ అని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.