Share News

YS Jagan : సీఎం వైఎస్ జగన్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

ABN , First Publish Date - 2023-11-10T18:31:39+05:30 IST

YS Jagan Reddy Convoy Met Accident : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan Mohan Reddy) తృటిలో ప్రమాదం తప్పింది.

YS Jagan : సీఎం వైఎస్ జగన్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

కడప జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan Mohan Reddy) తృటిలో ప్రమాదం తప్పింది. రెండ్రోజులుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో సీఎం పర్యటిస్తున్నారు. వేముల మండలంలో వైసీపీ నేతలతో (YSRCP) సమీక్ష అనంతరం ఇడుపులపాయకు (Idupulapaya) తిరుగుపయనం అయ్యే సమయంలో మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారును (YS Jagan Car).. కాన్వాయ్‌లోని కారు ఢీ కొన్నది. ఇలా ఒకట్రెండు కార్లను జగన్ కారు ఢీ కొంటూ ఆగకుండా ముందుకు వెళ్లింది. దీంతో రెండు, మూడు కార్ల వెనుక భాగం దెబ్బతిన్నది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు, పెద్ద ప్రమాదం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ ఘటన తర్వాత వేరే కారులో ఇడుపులపాయ ఎస్టేట్‌కు జగన్ చేరుకున్నారు. అనంతరం అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న సీఎం అమరావతికి బయల్దేరి వెళ్లారు.


Jagan-Convoy.jpg

Updated Date - 2023-11-10T18:31:42+05:30 IST