Prashant Kishore: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేదాంతం

ABN , First Publish Date - 2023-09-16T18:08:45+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ఎన్నికల వేదాంతం చెప్పారు.

Prashant Kishore: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేదాంతం

ఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ఎన్నికల వేదాంతం చెప్పారు.


"యథాప్రజా...తథా నేత.. ప్రజలు అవినీతిపరులైతే నేతలు హరిశ్చందులవుతారా?. డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తే నేత దొంగ కాకుండా హరిశ్చంద్రుడవుతాడా?. రూ. 500లకు ఓటును అమ్ముకొని నేతను మాత్రం హరిశ్చంద్రుడుగా ఉండమనడం అన్యాయం. ఓటరు అవినీతిపరుడైతే రాజకీయనేతలూ అవినీతిపరులవుతారు. రూ. 500లకు ఓటు అమ్ముకుంటే మీ నేత మీ గౌరవ మర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడు. చికెన్ బిర్యానీకి, మద్యం బాటిల్ కి ఓటేసేవారికి నేతలను నిలదీసే అధికారం లేదు. సమాజం ఎలా ఉంటే నేతలూ అలానే ఉంటారు. ఓటేయడానికి నేతలు డబ్బులిచ్చినప్పుడు ఉచిత ప్రభుత్వ పథకాలకూ ప్రజలనుంచి డబ్బులు వసూలు చేస్తారు. ప్రజలు మాత్రం దొంగలుగా ఉండి నేతలను మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది అసాధ్యం కాదు..సమాజం ఎలా ఉంటే నేతలు కూడా అలానే ఉంటారు." అని జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.

Updated Date - 2023-09-16T18:50:26+05:30 IST