AP Governor Nazir : ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-18T23:02:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్(Abdul Nazir) ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు(Manipal Hospital Doctors) హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

AP Governor Nazir : ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్(Abdul Nazir) ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు(Manipal Hospital Doctors) హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.డా. సుధాకర్ కంటిపూడి మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరాలు తెలిపారు. గవర్నర్ ఈరోజు తీవ్ర కడుపు నొప్పి కారణంగా మణిపాల్ హాస్పిటల్లో చేరారు. వైద్యపరీక్షల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్‌తో బాధ పడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది.గవర్నర్‌కి రోబో సాయంతో 'అపెండెక్టమీ' అనే సర్జరీని డాక్టర్లు చేశారు. సర్జరీ విజయవంతం అయినట్లుగా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా. సుధాకర్ తెలిపారు.

Updated Date - 2023-09-18T23:02:41+05:30 IST