Ashok Babu: విద్యుత్ ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2023-08-07T16:14:26+05:30 IST

అధికారమదంతో విద్యుత్ ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. పర్యావసానం ఊహించలేని విధంగా ఉంటుందని జగన్ రెడ్డి గ్రహించాలి. 01-04-2002 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ, ఫ్రీజ్ చేసిన డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ డిమాండ్లు జగన్ రెడ్డి తక్షణమే పరిష్కరించాలి.

Ashok Babu: విద్యుత్ ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది

అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే నష్టపోయేది ప్రభుత్వమేనని (YCP Government) టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు (Ashok Babu) హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారమదంతో విద్యుత్ ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. పర్యావసానం ఊహించలేని విధంగా ఉంటుందని జగన్ రెడ్డి (Cm jagan) గ్రహించాలి. 01-04-2002 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ, ఫ్రీజ్ చేసిన డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ డిమాండ్లు జగన్ రెడ్డి తక్షణమే పరిష్కరించాలి. ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిన జగన్ రెడ్డి ఒక డీఏ, 7 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామనడం సిగ్గుచేటు. విద్యుత్ పంపిణీ సంస్థల్ని అప్పులకు వాడుకోవడం, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం తెలిసిన జగన్‌కు ఉద్యోగుల సమస్యల పరిష్కారం తెలియదా? తన శాఖ ఉద్యోగులు రోడ్డెక్కితే విద్యుత్ శాఖ మంత్రి అధికారుల్ని చర్చలకు పంపడం సిగ్గుచేటు. ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగులు వేరు.. విద్యుత్ ఉద్యోగులు వేరని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు నిలిచిపోయినా.. విద్యుత్ ఉద్యోగుల సేవలు ఆగలేదు. పీఆర్సీ కమిషన్‌తో సర్కారుకు తెల్లకాగితం ఖర్చుతప్ప.. ఉద్యోగులకు ఒరిగేదేమీలేదు. విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి.. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించేవరకు టీడీపీ వారికి అండగా ఉంటుంది.’’ అని అశోక్‌బాబు భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-08-07T16:14:26+05:30 IST