Chadalavada ArvindBabu: ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే టీడీపీ నేతపై దాడులు

ABN , First Publish Date - 2023-02-02T09:55:51+05:30 IST

నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు స్పందించారు.

Chadalavada ArvindBabu: ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే టీడీపీ నేతపై దాడులు

పల్నాడు: నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల (Firing on TDP leader Venna BalakotiReddy) ఘటనకు సంబంధించి టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు (TDP Incharge Chadalavada ArvindBabu) స్పందించారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.... ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (MLA GopiReddy Srinivas Reddy) నర్సరావుపేట (Narsaraopet)కు గన్ కల్చర్ (Gun Culture) తీసుకొచ్చారని ఆరోపించారు. బాలకోటి రెడ్డి (TDP Leader)పై రెండోసారి హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి (YCP MLA) కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నారు. నరసరావుపేట ఎస్పీ (Narsaraopet SP) ఉన్నప్పటికీ హత్యలు, దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఇబ్రహీం హత్య జరిగిందని... తాజాగా బాలకోటి రెడ్డిపై హత్య ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకోటిరెడ్డి బలమైన టీడీపీ నేత అని తెలిపారు. గతంలో టీడీపీ నేతపై దాడి చేసిన తర్వాత వెంకటేశ్వరెడ్డికి ఎమ్మెల్యే గోపిరెడ్డే ఆశ్రయం ఇచ్చారని... దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. బాలకోటి రెడ్డిపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, రాముడు, గడ్డం వెంకట్రావులు ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరులే అని అరవింద్ బాబు ఆరోపించారు.

అసలేం జరిగిందంటే...

నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై కాల్పులు (Firing on TDP leader) జరపడం కలకలం రేపింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు కాల్పులు జరిపారు. గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న టీడీపీ నేతను బయటకు పిలిచి మరీ పిస్టల్‌తో కాల్చారు. వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులతో బాలకోటిరెడ్డి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయపడిన టీడీపీ నేతు హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ప్రభుత్వంలో బాల కోటిరెడ్డి రొంపిచెర్ల ఎంపీపీగా పని చేశారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరగడం ఇది రెండో సారి. కొద్ది నెలల క్రితమే ఆయనపై పలువురు వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా స్వగ్రామం అలవాలలో మరోసారి కాల్పులతో హత్యాప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబు ఆస్పత్రికి చేరుకుని బాలకోటిరెడ్డి పరామర్శించి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

శివారెడ్డి అంటూ వచ్చి....

కాల్పులపై బాలకోటి రెడ్డి భార్య నాగేంద్రమ్మ (BalakotiReddy Wife Nagendramma) మాట్లాడుతూ... ‘‘రాత్రి పదిన్నర గంటల సమయంలో వచ్చి తలుపు కొట్టారు. శివారెడ్డి అని పేరు చెప్పాడు. నేను వెళ్ళి తలుపు తీశాను. బాలకోటి రెడ్డి నా వెనుక నిలబడ్డాడు. శివారెడ్డి ఎవరూ అని ప్రశ్నించగానే తుపాకి తీసి కాల్చాడు. బుల్లెట్ బాలకోటి రెడ్డి పొట్టలో దిగింది. వెంటనే బాలకోటిరెడ్డి తలుపు వేసి అడ్డంగా నిలబడ్డాడు. నేను కేకలు వేయగానే చుట్టు పక్కల వాళ్ళు వచ్చారు. రాముడు కూడా వచ్చిన వాళ్ళలో ఉన్నాడు’’ అని నాగేంద్రమ్మ తెలిపారు.

Updated Date - 2023-02-02T10:02:49+05:30 IST