Share News

AP News: క్రైస్తవ సమాధుల స్థలం వద్ద టీడీపీ, జనసేన ఆందోళన

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:08 AM

Andhrapradeshh: జిల్లాలోని ఓబుల్ నాయుడుపాలెం వద్ద క్రైస్తవ సమాధుల స్థలంలో టీడీపీ - జనసేన ఆందోళనకు దిగింది. సమాధుల స్థలంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీసీ తీరుకు వ్యతిరేకంగా సమాధుల స్థలంలోనే టీడీపీ, జనసేన నేతలు నిరసన చేపట్టారు.

AP News: క్రైస్తవ సమాధుల స్థలం వద్ద టీడీపీ, జనసేన ఆందోళన

గుంటూరు: జిల్లాలోని ఓబుల్ నాయుడుపాలెం వద్ద క్రైస్తవ సమాధుల స్థలంలో టీడీపీ - జనసేన ఆందోళనకు దిగింది. సమాధుల స్థలంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీసీ తీరుకు వ్యతిరేకంగా సమాధుల స్థలంలోనే టీడీపీ, జనసేన నేతలు నిరసన చేపట్టారు. మాజీ క్రిస్టియన్ కార్పోరేషన్ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల ద్రోహి జగన్ రెడ్డి అంటూ క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో క్రైస్తవ సమాధుల కోసం 14 ఎకరాల కేటాయించగా... నాలుగేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్షణమే స్మశాన వాటికిను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 18 , 2023 | 10:08 AM