Share News

AP NEWS: మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2023-12-04T14:42:59+05:30 IST

మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకి గురవుతున్నారు.తుపాను కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.

AP NEWS: మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్ల రద్దు

విజయవాడ : మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకి గురవుతున్నారు.తుపాను కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలోని 6 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ఒక్కొక్క పాయింట్‌లో ముగ్గురు టీసీలను రైల్వే యంత్రాంగం ఏర్పాటు చేసింది.హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రయాణికులకు రైల్వే అధికారులు సమాచారం అందిస్తున్నారు. చెన్నై , తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల , చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తామని రైల్వే యంత్రాంగం తెలిపింది.

Updated Date - 2023-12-04T14:43:35+05:30 IST