Chand Basha: చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

ABN , First Publish Date - 2023-09-22T18:06:48+05:30 IST

తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) కోసం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(Delhi Hazrat Nizamuddin Dargah )లో ఆ పార్టీ నాయకులు ప్రార్థనలు చేశారు.

Chand Basha: చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) కోసం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(Delhi Hazrat Nizamuddin Dargah )లో ఆ పార్టీ నాయకులు ప్రార్థనలు చేశారు. చంద్రబాబు జైలునుంచి బయటకు రావాలని అల్లాకు ప్రార్థించినట్లు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా(Attar Chand Basha) తెలిపారు.దర్గాపైన చాదర్ సమర్పించి దువా చేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. చంద్రబాబు అక్రమ కేసుల నుంచి విముక్తి పొంది ఏపీ సీఎం కావాలని ప్రార్ధించాను. నారా లోకేశ్‌కి కూడా మనోధైర్యం కల్పించి ముందుకు సాగాలని కోరుకున్నా. రేపు అజ్మీర్ దర్గాకు వెళ్లి అక్కడ కూడా ప్రార్ధనలు చేస్తానని అత్తార్ చాంద్ బాషా పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T18:06:48+05:30 IST