Nara lokesh: విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన లోకేశ్
ABN , First Publish Date - 2023-09-26T15:47:37+05:30 IST
విజయనగరం కలెక్టరేట్ దగ్గర విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) ఖండించారు.

అమరావతి: విజయనగరం కలెక్టరేట్ దగ్గర విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) ఖండించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకంపై లోకేశ్ మండిపడ్డారు. నిర్దాక్షిణ్యంగా బట్టలూడదీసి మరీ విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు. కొట్టండి, లోపలేయండి అంటూ పోలీసులకు హుకుం జారీ చేస్తూ చెలరేగిపోయిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.