AP NEWS: ఓఎన్‌జీసీ సొమ్ముకు జగన్ సర్కార్ సోకులు
ABN , First Publish Date - 2023-11-21T15:04:30+05:30 IST
ఓఎన్‌జీసీ సొమ్ముకు జగన్ సర్కార్ సోకులు అద్దుతోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వర్చువల్‌గా ఓఎన్‌జీసీ ఇచ్చే సొమ్మును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం నాడు విడుదల చేశారు.

తాడేపల్లి: ఓఎన్‌జీసీ సొమ్ముకు జగన్ సర్కార్ సోకులు అద్దుతోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వర్చువల్‌గా ఓఎన్‌జీసీ ఇచ్చే సొమ్మును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని మత్స్యకార కుటుంబాలకు ఓఎన్‌జీసీ నాలుగో విడత సాయం అందజేయనుంది. ఒక్కొక్కరికీ నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనుంది.